Saturday, April 18, 2009

jai tirumala tirupathy....

నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిస్తాను...నేను సైతం విశ్వ వృష్టికి అశ్రువొక్కటి ధారపోస్తాను...నేను సైతం భువన ఘోషకువెర్రిగొంతుక విచ్చి మ్రోస్తాను...ఎండకాలం మండినప్పుడు గబ్బిలంవలె క్రాగిపోలేదా?వానకాలం ముసిరి రాగా నిలువు నిలువునానీరు కాలేదా?శీతకాలం కోతపెట్టగ కొరడుకట్టీ కేకలేసానే?నేనొక్కన్నే నిల్చిపోతే చండ్రగాడ్పులు వానమబ్బులు,
మంచుసోనలు భూమిమీద భుగ్నమవుతాయి.......నింగి నుండి తొంగి చూసే చుక్కలన్నీ...రాలి నెత్తురు క్రక్కుకుంటూ పేలిపోతాయి......పగళ్ళన్నీ పగిలిపోయీ నిసీథాలు విసీర్నిల్లి.....మహాప్రళయం జగంనిండా ప్రగల్భిస్తుంది....నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను.....నేను సైతం విశ్వవీణకు తంత్రి నై మూర్ఛనలు పోతాను.....నేను సైతం భువన భవనపు ఎర్ర బావుటానై పైకి లేస్తాను......

No comments:

Post a Comment